విన్నర్ సెన్సార్.. సింగిల్ కట్ కూడా లేదట..!

మెగ మేనళ్లుడు సాయి ధరం తేజ్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా విన్నర్. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా సెన్సార్ స్క్రూటినికి వెళ్లిన ఈ సినిమా సింగిల్ కట్ కూడా లేకుండా యు/ఏ సర్టిఫికెట్ సంపాదించిందట. నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధులు నిర్మిస్తున్న ఈ సినిమా సుప్రీం హీరో సాయి ధరం తేజ్ స్టామినాను చూపిస్తుందని అంటున్నారు.

ఫాదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా మీద తేజ్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రిలీజ్ అయిన ట్రైలర్ అయితే సినిమా మీద అంచనాలను పెంచేసింది. లాస్ట్ ఇయర్ సుప్రీం హిట్ తర్వాత్ తిక సినిమాతో ఫ్లాప్ ఎదుర్కున్న తేజ్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని ఆరాటపడుతున్నాడు. డాన్ శీను, బలుపు, పండగ చేస్కో సినిమాల సక్సెస్ తో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న విన్నర్ కూడా ఆ హిట్ మేనియా కంటిన్యూ చేస్తుందని అంటున్నారు. మరి క్రేజీ కాంబినేషన్ లో మాస్ మసాలా ఫీస్ట్ గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.