
టాలీవుడ్ లో నిర్మాతల కొడుకులు హీరోలవడం చూస్తూనే ఉంటాం.. తాజాగా ఆ జాబితాలో బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లకొండ శ్రీనివాస్ వచ్చాడు. అల్లుడు శ్రీను, స్పీడున్నోడు సినిమాలు చేసిన ఈ కుర్ర హీరో స్టార్ హీరోయిన్స్ పై కన్నేశాడు. అందుకే మొదటి సినిమా అల్లుడు శ్రీనులో సమంత హీరోయిన్ కాగా తమన్నాతో ఐటం సాంగ్ చేయించాడు. ఇక స్పీడున్నోడులో కూడా గ్లామర్ టచ్ కోసం తమన్నా స్పెషల్ అప్పియరెన్స్ వచ్చేలా చేశాడు.
ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న శ్రీనివాస్ అందులో కూడా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక తన తర్వాత సినిమా శ్రీవాస్ సినిమాలో కూడా మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తో రొమాన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వరుసగా స్టార్ హీరోయిన్స్ అందరితో జతకడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్ అలాగైనా తాను స్టార్ గా ఎగదాలనుకుంటున్నాడు.
చేసిన రెండు సినిమాలు అంతగా ఆడలేదు. అయితే కుర్రాడిలోని స్పీడ్ అందరికి నచ్చింది. మరి స్టార్ హీరోయిన్స్ మీద మోజు పెంచుకున్న శ్రీనివాస్ రాబోతున్న సినిమాలతో అయినా హిట్ కొడతాడేమో చూడాలి.