పూజా హేగ్దే ఆ సమయంలో ఏం చేస్తుందంటే

అందం అభినయం సరిగా ఉన్నా సరే హీరోయిన్స్ కు లక్ తోడుంటేనే సక్సెస్ వచ్చేది. చేస్తున్న సినిమా ఎంత పెద్దదైనా సరే తామెంత పర్ఫెక్ట్ గా చేసినా సరే అది సూపర్ హిట్ అయితేనే తప్ప ప్రేక్షకులు గుర్తించరు. ఈ విషయంపై తనకు తానుగా ఓ నిర్ణయానికి వచ్చింది బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్దే. మోడల్ గా ఉన్న తను కోలీవుడ్ లో జీవా మాస్క్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. 

ఆ తర్వాత తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం చేసిన అమ్మడు అవి అంతగా ప్రజాదరణ పొందక పోయినా బాలీవుడ్ హ్యాండ్సం హీరో హృతిక్ రోషన్ మొహెంజోదారో సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఎన్నో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఆ సినిమా కూడా అమ్మడికి నిరాశే మిగిల్చింది. అందుకే తన సినిమా పరాభవాలను గుర్తు చేసుకుని రోజుకి ఓ పావుగంట బాధపడుతుందట పూజా. ప్రస్తుతం ఈ క్రేజీ భామ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమాలో నటిస్తుంది. మరి బన్ని అయినా హిట్ ఇచ్చి అమ్మడి ఫేట్ మారుస్తాడేమో చూడాలి.