చరణ్ సుకుమార్ ఇంకా సెట్ అవ్వలేదా

సుకుమార్ డైరక్షన్ లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ చేస్తున్న సినిమా అసలైతే ఈ నెల 15 నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయాల్సింది. కాని లొకేషన్స్ సరిగా కుదరక పోవడంతో సినిమా షూటింగ్ ను వాయిదా వేశారట. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమా మార్చ్ నుండి సెట్స్ మీదకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ తో దాదాపు పాతికేళ్ల క్రితం సినిమా కాబట్టి లొకేషన్స్ పర్ఫెక్ట్ గా ఉండాలని చూస్తున్నారు. అవి సెట్ అయితేనే సినిమా సెట్స్ మీదకు వెళ్లేది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను చూస్తున్నాడట సుకుమార్. సినిమాలో చరణ్ వినికిడి సమస్యతో ఉంటాడని ఎక్స్ క్లూజివ్ న్యూస్. రాం చరణ్ తో ప్రయోగం చేస్తున్న సుక్కు సినిమా ఫలితాన్ని ఎలా అందుకుంటాడో చూడాలి. సినిమా టైటిల్ గా మొగళ్తూరు మొనగాడు అని ప్రచారంలో ఉంది.