నాగబాబుకి దేశముదురులు షాక్

మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో గెస్ట్ రోల్స్ వేస్తూ బుల్లితెర మీద జబర్దస్త్ షో హోస్ట్ గా మంచి ఫాంలో ఉన్నాడు. ఆ ప్రోగ్రాం కంటెస్టంట్స్ తో పాటుగా హోస్టులుగా చేసే రోజా, నాగబాబులు కూడా క్రేజ్ సంపాదించారు. అయితే ఇప్పుడు ఈటివికి పోటీగా 'స్టార్ మా' అలాంటి ఓ కామెడీ షోనే పెట్టబోతున్నారట. దీనికి హోస్ట్ గా పోసాని కృష్ణమురళి ఉంటున్నారని తెలుస్తుంది. 

పోసాని కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ మాలో వస్తున్న ఈ ప్రోగ్రం టైటిల్ 'దేశముదురులు' అని పెట్టబోతున్నారట. కామెడీ చేస్తూ క్రేజ్ సంపాదించిన జబర్దస్త్ టీంకు పోటీగా కత్తి లాంటి కంటెస్టంట్స్ ను ఇప్పటికే సెలెక్ట్ చేశారట స్టార్ మా టీం. ఇక ఫీమేల్ హోస్ట్ గా రమ్యకృష్ణని అడుగుతున్నారట. జబర్దస్త్ కి పోటీగా మిగతా చానెల్స్ అన్ని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి స్టార్ మా చేస్తున్న ఈ దేశముదురులు ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.