రానా ఘాజి అదరగొట్టాడు..!

1971 లో ఇండియా మీద పాకిస్థాన్ చేసిన ఘాజి ఎటాక్ ను సినిమాగా తీర్చిదిద్ది ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు సంకల్ప్ రెడ్డి. రానా లీడ్ రోల్ చేసిన ఈ సినిమా రిలీజ్ కు ముందే సంచలనాలను సృష్టిస్తుంది. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా దాదాపు 3500 స్క్రీన్లలో రిలీజ్ అవుతుందట. ఇక సినిమా మీద ఉన్న నమ్మకంతో డిజిటల్ రైట్స్ అన్ని భాషల్లో కలుపుకుని 12.5 కోట్లకు కొనేశారట.

రానా కెరియర్ లో ఈ రేంజ్లో సినిమా శాటిలైట్ అవ్వడం ఇదే మొదటిసారి. బాహుబలిలో భళ్లాలదేవగా సత్తా చాటిన రానా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. కొత్త కొత్త ప్రయోగాలకు రానా ఎప్పుడు ముందుంటాడు. పివిపి బ్యానర్లో వచ్చిన ఈ ఘాజి రానాకు మరో సంచలన విజయం అందించాలని ఆశిద్దాం.