
సూపర్ స్టార్ మహేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉంటునా తన కుటుంబంతో గడిపే విషయాల్లో మాత్రం అసలు కాంప్రమైజ్ అవడు. నెలకో రెండు నెలలకో ఫారిన్ ట్రిప్ వేసే మహేష్ అండ్ ఫ్యామిలీ ఆ ట్రిప్ తాలుకా ఫోటో లతో కూడా ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని కలిగిస్తారు. అయితే ఎప్పుడు అలాంటి ఫోటోలతోనే బయటకు వచ్చే మహేష్ మొదటి సారి ఓ షాట్ వేసుకుని బాటిల్ చేతిలో పెట్టుకుని కనిపించాడు.
బహుశా ఆ లుక్ చూస్తే అప్పుడే జాగింగ్ లాంటివి పూర్తి చేసుకుని వచ్చాడని అర్ధం చేసుకోవచ్చు. టోప్, చేతిలో వాటర్ బాటిల్ ఇవన్ని దానికే సంకేతాలుగా చూపిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే మహేష్ తన ఫిట్నెస్ మీద కాన్సెంట్రేట్ పెడుతూ వచ్చిన ఈ పిక్ చాలా ప్రత్యేకం. మహేష్ నుండి ఇలాంటి ఫోటో వస్తుందని ఊహించి ఉండరు. స్టార్ హీరోలు ఈమధ్య సినిమాల కోసం రిస్క్ చేసి మరి ఫిట్నెస్ గా ఉంటున్నారు. మరి ఆల్రెడీ హ్యాండ్సం లుక్ లో అదరగొట్టే మహేష్ బాడి ఫిట్ తో కూడా మనసు దోచేసేందుకు రెడీ అవుతున్నాడు.