
సీనియర్ స్టార్ హీరోగా నాగార్జున ప్రస్తుతం చేస్తున్న సినిమాలు తన వయసున్న హీరోలకే కాదు ఇప్పటి స్టార్ హీరోలకు కూడా షివరింగ్ తెప్పిస్తున్నాయంటే నమ్మాలి. హీరో వయసు కొడుకులున్నా తన సత్తా చాటుతున్న కింగ్ నాగార్జున రీసెంట్ గా ఓం నమో వెంకటేశాయ సినిమాలో తన నట విశ్వరూపం చూపించారు. ఇక ప్రస్తుతం రాజు గారి గది-2 లో నటిస్తున్న నాగార్జున ఆ సినిమా విశేషాలతో సర్ ప్రైజ్ చేస్తున్నారు.
బుల్లితెర యాంకర్ నుండి నిర్మాతగా దర్శకుడిగా మారిన ఓంకార్ మొదటి సినిమా ఫ్లాప్ అయినా రెండో సినిమా చిన్న బడ్జెట్ తో పెద్ద విజయం సాధించాడు. ఈ క్రమంలో ఆ సినిమా సీక్వల్ లో కింగ్ నాగార్జుననే ఒప్పించాడంటే ఎంత పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో వస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే సినిమాలో నాగార్జున మెంటలిస్ట్ గా కనిపిస్తాడట. అంటే మైండ్ రీడింగ్ పర్సనాలిటీతో అవతల వాళ్ల మనసులో ఉన్న ఆలోచనని గుర్తించడం అన్నమాట.
మైండ్ రీడింగ్ తో పాటు సినిమాలో హర్రర్ టచ్ కూడా ఉంటుందని అంటున్నారు. సో మొత్తానికి నాగ్ చేత కొత్త పాత్ర చేయిస్తున్న ఓంకార్ సినిమా మంచి ఫలితాన్నే అందుకుంటాడనిపిస్తుంది. సినిమాలో లీడ్ రోల్స్ వేరే కనిపించినా నాగ్ పాత్ర మాత్రం హైలెట్ గా నిలుస్తుందట.