
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చెలామని అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. కెరియర్ మొదలు పెట్టింది చిన్న సినిమాలతో అయినా సరైన టైంలో అమ్మడు సూపర్ క్లిక్ అయ్యింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది. ప్రస్తుతం స్టార్ హీరోలతో జతకడుతున్న అమ్మడు కుర్ర హీరోలతో కూడా సై అనేస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆమె తమ సినిమాలో ఉంటే ఆ లక్ తమకి కలిసొస్తుందని కావాలని ఆమెను తీసుకుంటున్నారు.
సరిగ్గా ఇలానే జరిగిందట మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ విన్నర్ సినిమా విషయంలో. తేజ్ గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరెవరినో అనుకుంటుండగా తేజ్ మాత్రం రకుల్ ను తీసుకుందామని అన్నాడట. తనకున్న బడ్జెట్ తో అది సాధ్యపడని తెలిసిన గోపిచంద్ ఆప్షన్ వేరే వైపు తీసుకోబోయాడట. సినిమాలో రకుల్ హీరోయిన్ గా ఉంటే తన రెమ్యునరేషన్ లో కూడా కోత పెట్టేసేయండి అని హామీ ఇచ్చాడట తేజ్. సో అలా రకిల్ కోసం రిస్క్ చేసి మరి ఆమెతో రొమాన్స్ చేశాడు ఈ మెగా విన్నర్.
మరి ఇంత చేసినా సినిమాలో వీరిద్దరి పెయిర్ వర్క్ అవుట్ అయ్యిందో లేదో చూడాలి. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న విన్నర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు సాయి ధరం తేజ్. మరి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.