
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సిఎం అవుతున్నాడు.. ఏంటి ఇది నిజమేనా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేది నిజమే కాని అది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో.. ప్రస్తుతం కాటమరాయుడు మూవీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా తర్వాత త్రివిక్రం శ్రీనివాస్ తో మరో సినిమాకు సిద్ధమయ్యాడు. మార్చ్ 14 నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సిఎంగా కనిపించనున్నారట.
ఈ న్యూస్ బయటకు రాగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 2019 ఎలక్షన్స్ టార్గెట్ తో ఇప్పటికే జనసేన పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేసిన పవన్ తన సినిమాల ద్వారా కూడా ప్రజలకు తన సందేషాన్ని ఇవ్వనున్నారు. ఈ క్రమంలో త్రివిక్రం రాసిన కథ ముఖ్య పాత్ర పోశిస్తుందట. త్రివిక్రం పవన్ కాంబినేషన్ లో ఇప్పటికే జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు వచ్చి సూపర్ హిట్ కొట్టాయి. మరి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. సినిమాలో పవన్ సిఎం అంటూ టాక్ బయటకు రాగానే సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి.