నాని మరో దేవదాసు

నాచురల్ స్టార్ నాని హవా ఏ రేంజ్లో కొనసాగుతుందో ఆయన సినిమా కలక్షన్స్ చూస్తే అర్ధమవుతుంది. రీసెంట్ గా నాని నటించిన నేను లోకల్ కాసుల వర్షం కురిపిస్తుంది. నాని మార్క్ ఎంటర్టైనర్ గా వచ్చిన నేను లోకల్ కెరియర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ తో ఉన్న నాని తను చేస్తున్న తర్వాత సినిమాల గురించి జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమా శివ శంకర్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్ గా చేస్తుంది. ఆల్రెడీ జెంటిల్మన్ లో అలరించిన ఈ జంట మరోసారి సినిమాలో కనిపిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గా మిస్టర్ దేవదాసు అని పెట్టబోతున్నారట. తెలుగు తెర మీద దేవదాసు అంటే వెంటనే ఏయన్నార్ గుర్తుకు రావడం సహజమే. దేవదాసు ఎన్నో భాషల్లో తీసిన తెలుగులో సక్సెస్ అయినంత ఎక్కడా కాలేదు. అందుకే దేవదాసు ఆల్ రైట్స్ అక్కినేని గారికే ఇచ్చారు. 

ఇప్పుడు నాని కూడా మోడ్రెన్ దేవదాసుగా రాబోతున్నాడు. లాస్ట్ ఇయర్ మజ్నుగా వచ్చిన నాని ఇప్పుడు దేవదాసుగా ఎలాంటి అనుభూతిని ఇస్తాడో చూడాలి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో తెలియనున్నాయి.