సింగం నుండి మరో సీక్వల్ కూడా..!

విలక్షణ నటుడు సూర్య నటించిన సింగం సీరీస్ లో మూడో పార్ట్ సింగం-3 రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్ నాడు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా కలక్షన్స్ మాత్రం పర్వాలేదు అన్నట్టు కనిపిస్తున్నాయి. కోలీవుడ్ హీరో అయినా సరే తెలుగులో ఓ సగటు హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు హీరో సూర్య. గజిని సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న సూర్య ఆ తర్వాత నుండి ఇక్కడ స్టార్ క్రేజ్ సంపాదించుకున్నాడు.

సింగం సీరీస్ లలో కూడా మొదటి పార్ట్ యముడు ఇక్కడ మంచి విజయాన్ని అందుకుంది. సింగం-2 కూడా పర్వాలేదు.. ఇక ఎస్-3 కూడా కలక్షన్స్ బాగానే ఉన్నాయి. కోలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఈ ఉత్సాహంతోనే సింగం నుండి మరో సీరీస్ తీయాలని చూస్తున్నారట. రీసెంట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో సింగం-4 కూడా ఉంటుందని అన్నారు. 

హరి డైరెక్ట్ చేసిన సింగం-3 లో సూర్యతో పాటు అనుష్క, శృతి హాసన్ హీరోయిన్స్ గా నటించారు. హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో సూర్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.