
సూపర్ స్టార్ రజినికాంత్ నటిస్తున్న రోబో సీక్వల్ మూవీ 2.0 బడ్జెట్ మొదట 300 కోట్లని చెప్పారు. ఆ తర్వాత దానికి మరో 100 కోట్లు యాడ్ చేసి 400 కోట్లు అనేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమాకు కేటాయించిన బడ్జెట్ 450 కోట్లట. ఇంత బడ్జెట్ తో భారతీయ చలనచిత్రంలో సినిమా రావడం ఇదే మొదటిసారి. ఇక కేటాయించిన 450 కోట్లు కూడా సినిమాకు సరిపోవని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికి సినిమా 70 శాతం మాత్రమే షూటింగ్ పూర్తయిందట. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రజినికాంత్ తో పాటు ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. ఐ సినిమా నిరాశ పరచడంతో కాస్త డీలా పడ్డ శంకర్ ఈ సీక్వల్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి మితిమీరిన బడ్జెట్ పెట్టినా సినిమా తేడా వస్తే చాలా ప్రోబ్లెంస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ విషయం గమనించి నడుచుకుంటే బెటర్.. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా 2.0 ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ ఎనౌన్స్ చేశారు. 2017 దీవాళి టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.