ఖైదిలో అతనెందుకు లేడంటే..!

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150లో చిరు అభిమాని.. సన్నిహితుడు శ్రీకాంత్ ఎందుకు నటించలేదు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్ నటించిన సినిమాలో ఏదో ఒక చిన్న పాత్రైనా శ్రీకాంత్ వేసుంటే బాగుండేది కదా ఎందుకు అతను నటించలేదు అంటే సినిమాలో తగిన పాత్ర లేకపోవడమే అంటున్నారు. శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్, జిందాబాద్ లలో చిరుతో కలిసి నటించిన శ్రీకాంత్ ఈమధ్యనే రాం చరణ్, అల్లు అర్జున్ లతో కూడా కలిసి చేశాడు. 

చిరు రీ ఎంట్రీకి మరింత కలరింగ్ తెచ్చేందుకు శ్రీకాంత్ ను ముందు పెడమానుకున్నారు. కాని సరైన పాత్ర లేకపోవడంతో శ్రీకాంత్ ను ఆపేశారు. ఇక ఖైది సినిమాలో ఆలి చేసిన పాత్ర కోసం సునీల్ ను అడిగారని తెలిసిందే. ప్రస్తుతం కమెడియన్ నుండి హీరోగా ప్రమోట్ అయిన సునీల్ ఆ పాత్ర చేసేందుకు నిరాకరించాడు. అలా శ్రీకాంత్ కోసం అసలు స్కోప్ లేకపోవడం ఒకటైతే సునీల్ వచ్చిన అవకాశాన్ని కూడా కాదనుకున్నాడు. మొత్తానికి ఖైది సినిమా చిరు గ్రాండ్ ఎంట్రీకి వెల్కం చెబుతూ మరోసారి తన స్టామినాని ప్రూవ్ చేసింది.