నాని కుమ్ముడు ఏ రేంజ్లో అంటే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో హిట్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారాడు నాచురల్ స్టార్ నాని.. డబుల్ హ్యాట్రిక్ హిట్లతో మాంచి జోష్ లో ఉన్న నాని సినిమా కలక్షన్స్ తో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఫిబ్రవరి 3న రిలీజ్ అయిన నాని నేను లోకల్ మొదటి వారంలోనే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తీసుకొచ్చింది. వారం రోజుల్లోనే 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన నేను లోకల్ 10 రోజులకు సరిగ్గా 26.5 కోట్ల కలక్షన్స్ సాధించిందట.

నాని కెరియర్ లో భలే భలే మగాడివోయ్ సినిమా హయ్యెస్ట్ గా 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు నేను లోకల్ కూడా అదే రేంజ్ కలక్షన్స్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా థియేటర్స్ లో స్టాండర్డ్ కలక్షన్స్ సాధిస్తుంది నేను లోకల్. నాని నాచురల్ నటన, కీర్తి సురేష్ గ్లామర్ తో సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేశాయి. నక్కిన త్రినాథ రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా దిల్ రాజు నిర్మాణంలో వచ్చింది.