లాస్య, రాజ్ తరుణ్ రూమర్ అలా..!

బుల్లితెర మీద యాంకరింగ్ చేస్తూ క్రేజ్ సంపాదించిన లాస్య రాజ్ తరుణ్ తో లవ్ ట్రాక్ నడుపుతుందని ఇద్దరు కలిసి తిరుగుతున్నారని సర్ ప్రైజ్ టాక్ వచ్చింది.. అయితే వాటిని అప్పటికప్పుడు ఖండించలేని లాస్య రీసెంట్ గా మంజునాథతో ఎంగేజ్మెంట్ జరుపుకుని తర్వాత ఇచ్చిన ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. అందరి హీరోల ఆడియోలకు వెళ్లినట్టుగానే రాజ్ తరుణ్ సినిమా ఆడియోకి వెళ్లా.. అయితే అక్కడ తనతో దిగిన సెల్ఫీ ఈ న్యూసెన్స్ కు కారణమయ్యింది అంటుంది లాస్య. 


రాజ్ తరుణ్ తో సెల్ఫీ దిగడంతో ఆ పిక్ పట్టుకుని సోషల్ మీడియాలో గాసిప్పులు రాయడం మొదలు పెట్టారని.. అసలు అందులో ఏమాత్రం నిజం లేదని అన్నది లాస్య. తన స్నేహితుడు మంజునాథతోనే తను కొంతకాలంగా ప్రేమిస్తున్నా అని పెద్దల అంగీకారంతోనే తమ పెళ్లి జరుగుతుందని అన్నది. మొత్తానికి ఓ సెల్ఫీ లాస్యను రాజ్ తో లింక్ పెట్టేలా చేసిందన్నమాట.