
టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన పూరి ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడని తెలిసిందే.. టెంపర్ తర్వాత తీసిన సినిమాలన్ని అంచనాలను అందుకోలేని పూరి ఈసారి తనకు స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చిన చంటిగాడి ప్రేమకథతో రాబోతున్నాడు. కెరియర్ మొదట్లో ఇడియట్ సినిమా పూరి రవితేజలకు ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో తెలిసిందే. ఇక ఇప్పుడు రోగ్ అంటూ వస్తున్న పూరి మరో చంటిగాడి ప్రేమగాథ అని ట్యాగ్ లైన్ పెట్టాడు.
ఇజం ఫ్లాప్ తో స్టార్ హీరోలెవరు పూరిని పలుకరించలేదు. అందుకే రోగ్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు పూరి. సినిమా ఎప్పుడో పూర్తయినా తన మార్క్ కోటింగ్ ఇచ్చి వాలెంటైన్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఫస్ట్ లుక్ అయితే ఇంప్రెసివ్ గానే ఉంది.. పూరి మార్క్ టేకింగ్ తో కనుక వస్తే కచ్చితంగా సినిమా మంచి ఫలితాన్ని అందుకున్నట్టే. సినిమా రిజల్ట్ తన ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందనే ఆలోచనతో పూరి రోగ్ మీద పూర్తి కాన్సెంట్రేషన్ పెట్టాడు. మరి పూరి ఆశించిన ఫలితం రోగ్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.