అఖిల్ కన్ను ఆమెపై పడ్డదా..!

అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా స్టార్ అవ్వడానికి అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం తన సెకండ్ మూవీని పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్న అఖిల్ విక్రం కుమార్ దర్శకత్వంలో సినిమా కన్ఫాం చేశాడని తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుంటున్నారట. 

హీరోయిన్ విషయంలో అఖిల్ అనుపమనే కావాలని పట్టుబట్టాడట. మలయాళ ప్రేమంతో అందరిని ఆకట్టుకున్న అనుపమ తెలుగులో అదే సినిమాతో క్రేజ్ సంపాదించింది. అఆ, శతమానం భవతి ఇలా చేసిన ప్రతి సినిమా హిట్ అందుకుని గోల్డెన్ లెగ్ గా మారిన అమ్మడు తనకు లక్ ఇస్తుందని అఖిల్ ఆశపడుతున్నాడు. కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేసే క్రమంలో హీరోయిన్ విషయంలో తన ఓటు అనుపమకే వేశాడట. 

అనుపమ క్రేజ్ తెలుస్తున్న నాగార్జున ఆమెనే ఫైనల్ చేసే ఆలోచన చేస్తున్నాడు. దాదాపు 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు.