దిల్ రాజు రవితేజ అసలు సీక్రెట్ అదా..!

మాస్ మహరాజ్ రవితేజ సంవత్సరన్నర గ్యాప్ తీసుకుని ఒకేసారి రెండు సినిమాలను స్టార్ట్ చేశాడు. విక్రం సిరి డైరక్షన్ లో మూవీ నల్లమలపు శ్రీనివాస్ ప్రొడ్యూస్ చేస్తుండగా.. అనీల్ రావిపూడి డైరక్షన్ లో వస్తున్న రాజా ది గ్రేట్ సినిమా మాత్రం దిల్ రాజు నిర్మిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ దిల్ రాజు రవితేజల మధ్య రెమ్యునరేషన్ గొడవలొచ్చాయని అన్నారు.. అందుకే రవితేజ నటించాల్సిన ఎవడో ఒకడు అటకెక్కించారు కూడా.

అయితే ఆ సినిమా ఆగిపోయింది రెమ్యునరేషన్ గొడవల వల్ల కాదట.. ఆ సినిమా డైరక్టర్ వేణు శ్రీ రాం తీసిన మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ ఫ్లాప్ అయ్యింది. అసలే కెరియర్ ఫ్లాపుల్లో ఉన్న రవితేజ రిస్క్ తీసుకోవడం ఎందుకని అది చేయనన్నాడట. రవితేజ ఆ సినిమా చేయననడానికి కారణం ఇది అయితే బయటకు మాత్రం రెమ్యునరేషన్ గొడవల వల్లే ఆ సినిమా ఆగిపోయిందని అన్నారు. మళ్లీ అదే దిల్ రాజుతో అనీల్ రావిపూడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు రవితేజ. సో దిల్ రాజు రవితేజల మధ్య రిలేషన్ బాగానే ఉంది కాని డైరక్టర్ వేణు శ్రీరాం తో సినిమా చేయడం ఇష్టం లేకనే కాస్త గ్యాప్ తీసుకున్నాడు రవితేజ. 

ఇక అనీల్ రావిపూడి మాత్రం తీసిన రెండు సినిమాలు పటాస్, సుప్రీం రెండు హిట్లుగా క్రేజ్ సంపాదించాడు కాబట్టి తను చెప్పిన నేరేషన్ కూడా నచ్చేయడంతో సినిమా కన్ఫాం చేశాడు. రాజా ది గ్రేట్ అని వస్తున్న ఈ సినిమాలో రవితేజ బ్లైండ్ మ్యాన్ గా నటిస్తున్నాడు.