
స్వీటీ అనుష్క పని అయిపోయినట్టేనా.. ఇక ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పడం మంచిదా.. ప్రస్తుతం ఇలాంటి కామెంట్స్ వినపడుతున్నాయి. అమ్మడు నటించిన సింగం-3, ఓం నమో వెంకటేశాయ సినిమాలు రెండు ఒక్కరోజు గ్యాప్ తో రిలీజ్ అయ్యాయి. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా వాటిలో అనుష్క లుక్ మాత్రం ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసింది. సైజ్ జీరో కోసం రిస్క్ చేసి మరి సైజ్ పెంచేసిన అనుష్క ఇంకా దాని గురించి ఇబ్బందులు పడుతూనే ఉంది.
ఓ విధంగా చెప్పాలంటే అనుష్క లుక్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. సినిమా కోసం లావు పెంచేసిన అనుష్క దాన్ని తగ్గించే ప్రయత్నంలో మాత్రం విఫలమవుతుంది. అయితే ఈ రెండు సినిమాల్లో అనుష్క ఎలా ఉన్నా సరే చెల్లిపోయింది కాని రాబోతున్న బాహుబలి సెకండ్ పార్ట్ లో దేవసేనగా అనుష్క ఎలా ఉంటుంది అన్నది ఫ్యాన్స్ లో కాస్త కన్ ఫ్యూజన్ మొదలైంది.
ఇలానే ఉంటే ప్రభాస్ పక్కన అనుష్క తేలిపోయినట్టే. అనుష్క సైజ్ గురించి రాజమౌళి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో. రిలీజ్ అయిన రెండు సినిమాల్లో యాక్టింగ్ పరంగా ఓకే కాని అనుష్క లుక్ పరంగా మాత్రం ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి చూస్తుంటే అనుష్క పెట్టాబేడా సర్ధేయాల్సిన రోజు దగ్గరకు వచ్చిందని అంటున్నారు.