
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్స్ సమంత, నిత్యా మీనన్ ల కన్నా ఒకే ఒక్క ఐటం సాంగ్ పక్కా లోకల్ అంటూ చేసి క్రెడిట్ అంతా ఎత్తుకెళ్లింది కాజల్. ఓ రకంగా కాజల్ కెరియర్ మళ్లీ ఊపందుకుంది అంటే ఆ సాంగ్ లో తను చూపించిన వయ్యారాలే అని చెప్పాలి. ఫేడవుట్ కు దగ్గరవుతుంది అనుకున్న టైంలో సరిగ్గా హాట్ ఐటం తో కాజల్ కేక పెట్టించేసింది. అందుకే ఆమెకు వరుసెంట ఆఫర్లు వచ్చేస్తున్నాయి.
ఇక ప్రస్తుతం తారక్ చేస్తున్న బాబి సినిమాలో కూడా కాజల్ ఓ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జనతా గ్యారేజ్ టైంలోనే ఐటం సాంగ్ చేస్తే తన తర్వాత సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చాడట తారక్ అందుకే కాజల్ సడెన్ గా ఐటం అవతారం ఎత్తింది. గ్యారేజ్ లో పక్కా లోకల్ పెద్ద హిట్ అవడంతో కాజల్ కు ఇటు తారక్ సినిమాలో ఛాన్స్ రావడమే కాకుండా ఇంకా చాలా సినిమా ఆఫర్లు వచ్చేస్తున్నాయట. సో ఆ రకంగా ఐటం బాగా నచ్చేయడంతో సినిమాలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ ఇచ్చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.