'శమంతకమణి' ఓ మల్టీస్టారర్..!

భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న శ్రీరాం ఆదిత్య ఇప్పుడు తన సెకండ్ సినిమాకు ముహుర్తం పెట్టాడు. ఇక్కడ విశేషం ఏంటంటే సినిమా యువ హీరోల మల్టీస్టారర్ కాగా.. సినిమా టైటిల్ గా శమంతకమణి అని పెట్టారు. వినాయక చవితి నాడు శ్రీకృష్ణుడు చంద్రుడిని చూడటంలో శమంతకమణి పాత్ర ఉంది. మరి మణి ఆధారంగా కథ నడుస్తుందని ఈ టైటిల్ పెట్టారో ఏమో కాని సినిమా టైటిల్ తోనే సగం మార్కులు కొట్టేశారు చిత్రయూనిట్.  

భవ్య ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, ఆది, సందీప్ కిషన్ హీర్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు నారా రోహిత్ కూడా సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. సో నలుగురు యువ హీరోలు చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా తెలుగు పరిశ్రమలో ఓ కొత్త ఉత్సాహాన్ని తెస్తుందని చెప్పొచ్చు. ఇటీవలే ముహుర్త కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందట. మరి డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న ఈ మల్టీస్టారర్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.