రొటీన్ ట్రైలరే కాని..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ నటిస్తున్న విన్నర్ మూవీ ట్రైలర్ ఇటీవలే విడుదల చేశారు. ట్రైలర్ రొటీన్ గా అనిపిస్తున్నా అందులో తేజ్ లుక్ ఇంకా డైలాగ్స్ మాత్రం కేక పెట్టిస్తున్నాయి. పులి ఊరు మీద పడ్డప్పుడు అందరు పారిపోతారు కాని ఒక్కడు ఎదురు వస్తాడు.. పట్టుమని పాతికేళ్లుండవ్ కాని పెట్టుకుంటే మాత్రం పాతికమంది పోతారు లాంటి డైలాగ్స్ ఫ్యాన్స్ కు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. 

గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. రిలీజ్ అయిన ట్రైలర్ అయితే మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. కంటెంట్ మాత్రం రొటీన్ గానే ఉన్నట్టు కనిపిస్తున్నా తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకునేలా ఉన్నాడు గోపిచంద్. లాస్ట్ ఇయర్ సుప్రీం హిట్ తర్వాత తిక్కతో ఫ్లాప్ ఫేస్ చేసిన తేజ్ ఈ విన్నర్ తో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. మహా శివరాత్రి కానుకగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.