
మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. మార్చ్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ఓ పల్లెటూరి కథ అని ఇప్పటికే ఎనౌన్స్ చేశారు. పాతికేళ్ల క్రితం నాటి పరిస్థితులను ఇందులో ప్రస్థావించడం జరుగుతుందట. ఇక సినిమా టైటిల్ గా నిన్న మొన్నటిదాకా పల్లెటూరి మొనగాడు, రేపల్లె అంటూ వినపడ్డాయి. కాని ఫైనల్ గా సినిమాకు మొగళ్తూరు మొనగాడు అని పెట్టబోతున్నారట.
సుకుమార్ క్రియేటివిటీ మనకు తెలిసిందే.. చెర్రి ని ఇప్పటికే సినిమాకు ఎలాంటి లుక్ కావాలో ఆ ఫోటో షూట్ చేసి రెడీ చేసుకున్నారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ఓకే అయ్యింది. ధ్రువ సక్సెస్ తో పాటుగా సినిమాలో సర్ ప్రైజ్ మేకోవర్ తో కనిపించిన చరణ్ ఈసారి కూడా కొత్త గెటప్ లో కనిపిస్తాడని అంటున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సాంగ్ సిట్టింగ్స్ స్టార్ట్ అయ్యాయట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చ్ నుండి రెగ్యులర్ షూట్ చేసుకోనుంది. మరి మొగళ్తూరు మొనగాడుగా చెర్రి ఏమాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.