
బాలీవుడ్ స్టార్ హీరోలు మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్, బాద్షా షారుఖ్ ఖాన్ కలిసి ఫోటో దిగితే ఎలా ఉంటుంది.. దానిలో థ్రిల్ ఏముంటుంది అని కదా.. వీరిద్దరు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో స్టార్స్ గా సూపర్ క్రేజ్ సంపాదించారు. అయితే పాతికేళ్లుగా ఇండస్ట్రీలో సూపర్ హీరోలుగా ఉన్న వీరు ఎప్పుడు కలిసి ఫోటో దిగలేదట. ఒకరితో ఒకరు కలిసి నటించడం పక్కన పెడితే ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉండటం వల్ల ఒకరిఒకరు కలిసే వీలు లేదు.
ఇక రీసెంట్ గా ఓ నైట్ పార్టీలో ఈ ఇద్దరు హీరోలు ఆప్యాయంగా కలుసుకున్నారు. ఆమీర్ ప్రస్తుతం తను చేయబోతున సినిమా గెటప్ లో ఉండగా షారుఖ్ ఖాన్ యంగ్ హీరోగా స్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇద్దరు కలిసి దిగిన ఈ పిక్ ట్విట్టర్ లో షేర్ చేసి మేర్మిద్దరం కలిసి ఫోటో దిగడం ఇదే మొదటి సారి.. వాట్ ఏ ఫన్ నైట్ అని ట్వీట్ చేశాడు షారుఖ్.
ఎంత స్టార్ హీరోలైనా సరే తోటి స్టార్స్ పై ఈమాత్రం అభిమానం ఉండటం తప్పేం లేదు. అయితే పరిస్థితులను బట్టి అవి ఎప్పుడు ఎలా బయట పడాలో అలా వస్తాయి. ప్రస్తుతం బాలీవుడ్ మీడియా ఈ పిక్ వైరల్ గా పాకుతుంది. సో ఖాన్ త్రయంలో అడ్డుగోడలన్ని ఇక పోయినట్టే లెక్క.