ఫ్లాపులొచ్చినా పూరి తగ్గట్లే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాడ్ టైం నడుస్తున్న డైరక్టర్ లలో పూరి జగన్నాథ్ ముందుంటాడు. టెంపర్ తర్వాత అలాంటి హిట్ ఏది అందుకోలేదు ఇక చేస్తున్న సినిమాలన్ని ఫ్లాప్ అవడంతో అతనితో సినిమా చేసే స్టార్స్ కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో కూడా పూరి తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అసలు తగ్గట్లేదని ఫిల్మ్ నగర్ టాక్. రామ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న పూరి వెంకటేష్ తో కూడా జనగణమన సినిమా చేయాలని చూస్తున్నాడు.

స్క్రిప్ట్ ఓకే అనుకున్నా పూరి రెమ్యునరేషన్ విషయంలోనే ఈ ప్రాజెక్టులు ముందుకు జరుగట్లేదట. మరి ఫ్లాపుల్లో ఉన్నాం కదా అని తన రెమ్యునరేషన్ కూడా తగ్గించుకోని పూరి తనను ఓకే అనుకున్న వారే చేస్తారనే ధైర్యంతో ఉన్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రాం, వెంకటేష్ సినిమాలు ఈ కారణం చేతనే కాస్త లేట్ అవుతున్నాయట. మరి ఈ రెండు ప్రాజెక్టుల్లో పూరి దేన్ని ఫైనల్ చేస్తాడో చూడాలి.