స్టార్ మల్టీస్టారర్ పై నాగ్ ఇలా..!

కింగ్ నాగార్జున ఈమధ్య మరింత జోష్ పెంచాడని తెలిసిందే.. ఓ పక్క తన మార్క్ సినిమాలను చేస్తూనే మరో పక్క మల్టీస్టారర్ సినిమాలను చేస్తున్నాడు. ఊపిరి, నిర్మలా కాన్వెంట్ సినిమాల తర్వాత నాగార్జున చేసిన ఓం నమో వెంకటేశాయ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన ఏజ్ గ్రూప్ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాల ప్రస్థావన రాగా అలాంటి సినిమాలు చేస్తా కాని అందులో అవతలి హీరోతో పాటుగా సమ ప్రాధాన్యత ఉండాలి లేదంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు అంటూ తన మనసులోని మాట బయట పెట్టాడు నాగ్.  

అంటే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి వారితో కూడా మల్టీస్టారర్ సినిమాకు సిద్ధమే కాని తనకు వారికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి అని అంటున్నాడు. కుర్ర హీరోలకు అయితే అలాంటి పట్టింపులు లేవు కాని స్టార్స్ కు వచ్చే సరికి నాగార్జున మాట మార్చారు. ఇక ప్రయోగాలకు తాను ఎప్పుడు సిద్ధమే అంటూ చెప్పే నాగ్ తన కోసం ఎలాంటి కథ తీసుకొచ్చినా సరే చేసేందుకు సిద్ధమే అంటున్నారు. కొడుకులు హీరోలుగా ఎదిగి నటిస్తున్న ఈ వయసులో కూడా నాగ్ చేస్తున్న ఈ సాహసాలకు కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.