ఆ పనికి అనసూయ 10 లక్షలా

బుల్లితెర మీద తన అందాలతో మత్తు చల్లుతున్న హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. కామెడీ షోకే కతర్నాక్ కలరింగ్ తెచ్చిన ఈ బ్యూటీ అసలు సిసలైన ఐటం సాంగ్ చేస్తే అదిరే రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతం సాయి ధరం తేజ్ విన్నర్ సినిమాలో 'సూయ.. సూయ.. అనసూయ..' అంటూ ఓ ఐటం సాంగ్ చేసింది అనసూయ. ఈ సాంగ్ కోసం అమ్మడు భారీగానే డిమాండ్ చేసిందట. బుల్లితెర మీద తనకున్న హాట్ ఇమేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో అనసూయ తేజ్ విన్నర్ సినిమాలో ఈ సాంగ్ కు 10 లక్షలు డిమాండ్ చేసిందట.   

ఫేడవుట్ హీరోయిన్స్ ను సినిమా మొత్తానికి ఇచ్చే ఈ పారితోషికం అమ్మడి అందాలకు కానుకగా ఇచ్చారట. ఇక ఇచ్చిన డబ్బుకి నూటికి నూరు పళ్లు న్యాయం చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన విన్నర్ ఐటం సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ఓ ఊపు ఊపేస్తుంది. సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం తర్వాత అనసూయ చేస్తున్న ఈ హాట్ ఐటం సినిమాకే హైలెట్ అవుతుందని అంటున్నారు. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా నల్లమలపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్నారు. మరి అనసూయ అందాల మత్తు ఎంతవరకు వర్క్ అవుట్ అయ్యింది అన్నది ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతున్న సినిమా చూసేనే గాని చెప్పలేం.