
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ధ్రువ సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం సుకుమార్ తో సినిమాకు సిద్ధమైన చరణ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలో సినిమాకు టైటిల్ గా ఓ రెండు పేర్లు వినపడుతున్నాయి. వాటిలో ఒకటి రేపల్లె కాగా మరోటి పల్లెటూరి మొనగాడు. ఈ రెండు టైటిల్స్ సుకుమార్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. నాన్నకు ప్రేమతో తర్వాత సుక్కు చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సినిమా కోసం చెర్రి గడ్డం కూడా పెంచుతున్నాడట.. సినిమా ఎక్కువ భాగం విలేజ్ లోనే జరుగుతుందట. కథ ప్రకారంగా అనుకున్న రెండు టైటిల్స్ బాగానే కుదిరాయని అంటున్నారు. మరి వాటిలో ఏది ఫైనల్ చేస్తారు అన్నది చూడాలి.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మిస్తూ నిర్మాతలుగా తమ సత్తా చాటుతున్న మైత్రి మూవీ మేకర్స్ ప్రేక్షకుల మెప్పుపొందే సినిమాలను నిర్మిస్తున్నారు.