నాని నటరాజు స్వరూపం

నాచురల్ స్టార్ నాని నేను లోకల్ థియేటర్లో సందడి చేస్తుండగా కొద్ది పాటి రిలాక్స్ తో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కొత్త దర్శకుడు శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్న నాని దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా నటరాజు అని పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఇయర్ ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసి హిట్ అందుకున్న దిల్ రాజు రాబోయే సినిమాలు కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. 

ఇక టైటిల్ నటరాజు అని పెట్టబోతున్నారు. నానికి నటరాజుకి సంబంధం ఏంటి అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అదే క్రమంలో ఇప్పుడు మళ్లీ ఇలానే తన హిట్ మేనియా కొంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. నటరాజు స్వరూపంతో నాని ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతం సెట్స్ మీదున్న శివ డైరెక్ట్ చేస్తున్న సినిమాకు ఇంకా టైటిల్ కన్ఫాం చేయలేదు. సినిమాలో హీరోయిన్ గా నివేదా థామస్ నటిస్తుండగా ఆది పినిశెట్టి ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.