టైటిల్ సాంగ్ అదిరిపోద్దట..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ బయటకు వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో టైటిల్ సాంగ్ గురించి ఓ న్యూస్ వచ్చింది. మహేష్ నటించిన సినిమాల్లో అతడు, దూకుడు సినిమాల టైటిల్ సాంగ్స్ కెరియర్ లో బెస్ట్ అనిపించుకున్నాయి. వాటి తరహాలోనే ఇప్పుడు చేస్తున్న మురుగదాస్ సినిమాలోని సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారట.  

అంతేకాదు ఆ సాంగ్స్ రాసిన విశ్వనే ఈ సాంగ్ కూడా రాసి పాడుతున్నాడట. హారీస్ జైరాజ్ మ్యూజిక్ లో వస్తున్న ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిస్తుంది దానితో పాటుగా తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందని అంటున్నాడు లిరిక్ రైటర్ విశ్వ. విశ్వ ఈ రేంజ్లో చెప్పాడంటే కచ్చితంగా సినిమాలో టైటిల్ సాంగ్ అదిరిపోయినట్టే లెక్క. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పూర్తి చేయనున్నారు. ఈ టైటిల్ సాంగ్ కూడా ముంబై వంటి ఏరియాల్లో షూట్ చేశారట. సో అతడులో అదరక బదులే చెప్పేది అన్న రేంజ్లో మహేష్ నుండి మరో సాంగ్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట. అది ఎలా ఉంటుందో సినిమా వస్తేనే గాని చెప్పలేం.