తమిళనాడు రాజకీయాలపై వర్మ పంచ్..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ మరో పంచ్ వేశాడు.. కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఆర్జివి ప్రస్తుతం హాట్ హాట్ గా నడుస్తున్న తమిళనాడు రాజకీయాల గురించి తన మార్క్ సెటైరికల్ పంచ్ వేశాడు. శశికళను సిఎం చేస్తూ పన్నీర్ రిజైన్ చేయగా ఈ క్రమంలో ఒక్కసారిగా కథ అడ్డం తిరిగింది. ఈ తాజా పరిణామాలను చూసి వర్మ ట్వీట్ చేశాడు. జయలలిత ఆత్మ తనని సిఎం గా ఉండమని చెప్పడం తమిళనాడు రాజకీయాలు పొలిటికల్ హర్రర్ మూవీలా అనిపిస్తున్నాయని అన్నాడు వర్మ.      

ఇక ఈ ట్వీట్ లో మోది ఓ భూతవైద్యుడా అని అడుగుతున్నాడు వర్మ. విషయం ఏదైనా సరే తన మనసులో ఏది ఉందో అదే ట్వీట్ల రూపంలో సందించే వర్మ తమిళ రాజకీయాల మీద వర్మ సంధించిన ఈ ట్వీట్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. జయలలిత మరణం అనంతరం వర్మ శశికళ టైటిల్ మీద ఓ సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఆ సినిమాలో ఈ పరిస్థితులన్ని ప్రస్థావిస్తాడో లేదో చూడాలి.