
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి 'చెప్పను బ్రదర్' అన్న దగ్గర నుండి అతన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవర్ స్టార్ గురించి ఎలాంటి కామెంట్ చేయట్లేదు అల్లు అర్జున్. అయినా సరే ఇద్దరి మధ్య ఏం లేదు అని మెగా ఫ్యాన్స్ అంటున్నా.. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తుందో బన్ని మాత్రం నోరు విప్పలేదు. తానెందుకు తగ్గాలి అనుకున్నాడో ఏమో కాని బన్ని కాటమరాయుడు టీజర్ పట్ల రెస్పాండ్ అవకపోవడంపై మరోసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ కోపానికి కారణమవుతున్నాడు.
డాలి డైరక్షన్ లో తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా శరద్ పవార్ నిర్మాణంలో వస్తుంది. సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. టీజర్ తోనే రికార్డుల పరంపర కొనసాగిస్తున్న కాటమరాయుడు సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునేందుకు దగ్గరలో ఉన్న ఈ సినిమా ఉగాదికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.