కొత్త అవతారం ఎత్తిన సుమ..!

తన యాంకర్ తో ప్రొగ్రాం ఎలాంటిదైనా ఎంటర్టైన్ చేసే సుమ ఇప్పుడు సింగర్ గా కూడా మారిందని తెలుస్తుంది. ఏంటి సుమ సింగర్ గా మారిందా..? అంటే అవుననే అంటున్నారు.. ఇక ఆమె పాడింది ఎవరి సినిమాలోనో కాదు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ విన్నర్ సినిమాలో.. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సుమ ఓ సాంగ్ పాడింది. ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలోని సాంగ్ ఒక్కోటి సర్ ప్రైజ్ గెస్ట్ లతో డైరెక్ట్ గా ఆన్లైన్ లోకి రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఈరోజు ఆ సినిమాలో మరో సాంగ్ కోలీవుడ్ యువ సంగీత కెరటం అనిరుథ్ రిలీజ్ చేస్తుండగా ఆ సాంగ్ పాడింది సుమ అని ఎనౌన్స్ చేశారు. సుప్రీం హీరోగా మెగా అభిమానులకు దగ్గరైన సాయి ధరం తేజ్ నటిస్తున్న విన్నర్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందించగా నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.