
టాలీవుడ్లో హీరోయిన్స్ కొరత మాత్రమే కాదు విలన్ల కొరత కూడా ఉంది.. హీరోగా ఉండి విలన్ గా మారిన జగపతి బాబుని ఇప్పటికే అందరు హీరోలు వాడేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా హీరో నుండి విలన్ గా మారిన కోలీవుడ్ నటుడు అరవింద్ స్వామిని కూడా అదే రేంజ్లో తీసుకుంటున్నారు. ఆయన క్రేజ్ అక్కడ ఎలా ఉందో ఏమో కాని తెలుగులో మాత్రం అరవింద్ స్వామికి సూపర్ బజ్ ఏర్పడింది. ఇప్పటికే తని ఒరువన్ రీమేక్ గా వచ్చిన మెగా పవర్ స్టార్ ధ్రువ సినిమాలో చెర్రితో పాటు ఈక్వల్ క్రేజ్ సంపాదించాడు అరవింద్ స్వామి.
కోలీవుడ్ లో ఆ తర్వాత వచ్చిన జయం రవి అరవింద్ స్వామిల బోగన్ అక్కడ మాములు టాక్ తెచ్చుకున్నా సరే ఇక్కడ ఆ సినిమా రీమేక్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ రీమేక్ లో హీరోగా ఎవరైనా సరే విలన్ గా మాత్రం అరవింద్ స్వామి పక్కా అంటున్నారు. మరి తెలుగులో ఈ రేంజ్ ఇమేజ్ వస్తుందని భహుశా అతని కూడా ఊహించి ఉండడు. ఇప్పటికే తెలుగులో రెండు మూడు స్టార్స్ సినిమాల్లో ఆఫర్స్ వచ్చినా రెమ్యునరేషన్ విషయంలో అవి ఓకే అవలేదట. మరి టాలీవుడ్ లో జోరు కొనసాగిస్తున్న అరవింద్ స్వామి ఇలానే ఇంకా మరెన్నో సినిమాల్లో అలరించాలని ఆశిద్దాం.