పూరి చేతికి ఎన్టీఆర్ బయోపిక్..!

ఈ ఇయర్ సంక్రాంతికి శాతకర్ణి సినిమాతో వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న బాలయ్య ఆ సినిమా ఇచ్చిన జోష్ తో తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా, అన్నగా అభిమానాన్ని సాధించి తెలుగు ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నందమూరి తారక రామారావు బయోపిక్ చేస్తున్నట్టు ఎనౌన్స్ చేసాడు. దానికి సంబందించిన కథా చర్చలు జరుగుతున్నాయని.. అన్నగారితో సంబంధం ఉన్న వారందరిని కలిసి ఏయే అంశాలు ప్రస్థావించాలో నిర్ణయిస్తారట.

ఇక ఈ సినిమా దర్శకత్వ భాధ్యతలను పూరి జగన్నాథ్ తీసుకుంటాడని టాక్. ముందు ఈ బయోపిక్ ఆలోచన పూరిదే నట. పూరి చెప్పబట్టే బాలయ్య ఎన్.టి.ఆర్ బయోపిక్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక ఇక్కడ అసలు ప్రాబ్లెం ఏంటంటే పూరి ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు మరి అలాంటిది అతని చేతిలో ఎన్.టి.ఆర్ బయోపిక్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని డౌట్ పడుతున్నారు. మరో పక్క పూరి ఈ బయోపిక్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ గురించి మిగతా విషయాలు ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.