
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు బయోపిక్ లో తాను నటిస్తానని ఎనౌన్స్ చేశారు బాలకృష్ణ. రీసెంట్ గా 100వ సినిమా శాతకర్ణి సూపర్ సక్సెస్ అందుకున్న బాలయ్య 101వ సినిమాకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బయోపిక్ ల హవా కొనసాగుతుండగా బాలకృష్ణ కూడా తన తండ్రి ఎన్టీఆర్బయోపిక్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు ఏంటి అన్నది మాత్రం బయట పెట్టలేదు.
ఎన్.టి.ఆర్ సొంత ఊరైన కృష్ణాజిల్లా నిమ్మకూరులో పర్యటించిన బాలయ్య బాబు ఈ విషయాన్ని వెళ్లడించారు. ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ లో అన్ని కోణాలు టచ్ చేయడం జరుగుతుందని.. పూర్తి విషయాల కోసం ఆయన సన్నిహితులు బంధువులను కూడా తెలుసుకుని సినిమా చేస్తామని అన్నారు. మరి ఎన్.టి.ఆర్ బయోపిక్ అది కూడా బాలయ్య చేతడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. నందమూరి ఫ్యాన్స్ కు నిజంగా ఈ ఎనౌన్స్ మెంట్ ఓ ఉత్సాహాన్ని తెచ్చింది. మరి సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి.