
మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇక్కడ షాక్ ఏంటంటే సినిమా కథ ఇదేనంటూ ఫిల్మ్ నగర్ లో ఓ కథ చక్కర్లు కొడుతుంది. విలేజ్ నుండి వచ్చిన చరణ్ సిటీలో స్టడీ చేసి ఓ రీసెర్చ్ సెంటర్ లో జాబ్ చేస్తుంటాడట. అయితే అందులో ఉన్న విలన్ టీం మనుషుల మానసిక స్థితి మార్చే రీసెర్చ్ లో చరణ్ ను టార్గెట్ చేస్తారట.
ఈ ప్రయత్నంలో హీరో వారి నుండి ఎలా తప్పించుకున్నాడు అన్నది సినిమా పూర్తి కథ అని అంటున్నారు. కమర్షియల్ గా ఉంటూనే అందులో క్రియేటివిటీ పొందుపరిచే సుకుమార్ చరణ్ తో తీసే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా ఓకే అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో చెర్రి మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.