కుమ్మేస్తున్న కాటమరాయుడు

పవర్ స్టార్ నటిస్తున్న కాటమరాయుడు టీజర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. రిలీజ్ అయిన రెండు గంటల్లోనే 1 మిలియన్ వ్యూయర్ కౌంట్ సాధించిన కాటమరాయుడు ఇప్పుడు 2 మిలియన్ మార్క్ చేరుకునే సరికి ఏకంగా సౌత్ సూపర్ స్టార్ రజిని రికార్డుని కూడా బ్రేక్ చేశాడు. సూపర్ స్టార్ రజిని నటించిన కబాలి సినిమా టీజర్ 8 గంటల్లో 2 మిలియన్ వ్యూస్ సాధించింది. అయితే నిన్న రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ కేవలం 5 గంటల 23 నిమిషాల్లోనే 2 మిలియన్ వ్యూస్ సాధించింది.    

సో దీన్ని బట్టి తెలుస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనియా ఏ రేంజ్లో ఉందో.. నిన్న మొన్నటిదాకా షూటింగ్ సరిగా జరుగట్లేదు సినిమా మీద కూడా అంత బజ్ ఏం లేదు అన్నట్టు వార్తలు వచ్చినా వాటినన్నిటిని ఓ టీజర్ తో పటాపంచలు చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. డాలి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇక్కడ మరో విశేషం ఏంటంటే మెగాస్టార్ పదేళ్ల తర్వాత నటించిన ఖైది నంబర్ 150 సినిమా కూడా 1 మిలియన్ వ్యూస్ 3 గంటల సమయం తీసుకుంది. కాని పవన్ కళ్యాణ్ కేవలం 2 గంటల్లోనే ఆ ఫీట్ సాధించాడు. పవన్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉన్నారు అన్నది చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు.