మెగా ట్రెండ్ తోనే మెగా మేనళ్లుడు..!

మెగాస్టార్ ఫ్యామిలీ నుండి మేనళ్లుడుగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరం తేజ్ మంచి ఫాంలో ఉన్నాడు. తిక్క ఫ్లాప్ తప్ప కెరియర్ లో జోష్ మీదున్న తేజ్ రాబోతున్న విన్నర్ సినిమాకు మెగా సెంటిమెంట్ ఫాలో అయిపోతున్నాడు. సరైనోడుతో ఆడియో రిలీజ్ లాంటివేవి కాకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటూ ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన మెగా హీరోలు అదే క్రమంలో ధ్రువ, ఖైది నంబర్ 150 సినిమాలను కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేసి అభిమానులను ఉత్సాహపరచారు. 

ఇక రాబోతున్న విన్నర్ సినిమాకు కూడా సాయి ధరం తేజ్ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడట. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఈ నెల 19న జరపాలని చూస్తున్నారట. మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది. గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి మెగా ట్రెండ్ గా కొనసాగుతున్న ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ హవా తేజుకి కూడా విక్టరీని తెచ్చిపెడుతుందేమో చూడాలి.