
క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలుగులో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. అనతికాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన అమ్మడు కెరియర్ మొదట్లో తాను కూడా అవమానాలు పడ్డానని చెబుతుంది. ఎప్పుడు మన టైమే నడుస్తుందని అనుకుంటే పొరపాటే నేను కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను.. ఓ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ చేసి సడెన్ గా ఆ సినిమా నుండి తనను తొలగించారని ఇలా ఒక్కసారి మాత్రమే కాదు మొదట్లో చాలాసార్లు జరిగిందని అన్నది రకుల్.
అంత కష్టపడ్డది కాబట్టే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా టాప్ చెయిర్ లో ఉంది. బాలీవుడ్ లో సిని ప్రయాణం మొదలు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ అక్కడ కన్నా సౌత్ సినిమాల్లో ముఖ్యంగా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. స్టార్ సినిమా అంటే హీరోయిన్ గా మొదటి ఆప్షన్ రకుల్ అంటే నమ్మాలి. మొదట్లో కష్టాలని చూసి బెదరకుండా టాప్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన రకుల్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.