పవర్ పంచ్ అదిరిందిగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మూవీ టీజర్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయ్యింది. ఎంతమంది ఉన్నారన్నది కాదు ఎవడున్నాడన్నది ముఖ్యం అంటూ పవర్ స్టార్ తన మార్క్ డైలాగ్ తో వదిలిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఫ్యాన్స్ పండుగ చేసుకునే టీజర్ గిఫ్ట్ అందించాడు పవర్ స్టార్. 

గోపాల గోపాల సినిమా తర్వాత డాలితో కాటమరాయుడు మూవీ చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాత శరద్ పవార్ నిర్మిస్తున్న ఈ సినిమా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వస్తుంది. మార్చ్ 24న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.