
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ పక్క సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నాడో అలానే రాజకీయాల్లో కూడా అంతే బిజీ అవుతున్నాడు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయదలచుకుంటున్న పవన్ ఈలోగా కమిట్ అయిన సినిమాలన్ని పూర్తి చేసేలా షెడ్యూ వేసుకున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద కాటమరాయుడు ఈ నెల పూర్తివుతుండగా.. ఆ తర్వాత త్రివిక్రం, నీశన్ డైరక్షన్ లో మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు పవన్.
ఈ రెండు పూర్తి చేశాక చివరగా కొరటాల శివ సినిమా చేసి ఎన్నికల హడావిడిలో పాల్గొననున్నాడు పవర్ స్టార్. ఎన్నికల తర్వాత సినిమాలు చేస్తాడా లేడా అన్నది చెప్పలేం. కొరటాల శివ మహేష్ సినిమా తర్వాత పవన్ సినిమానే చేస్తాడట. ఇప్పటికే అనుకున్న కథ ఒకటి కొరటాల శివ పవర్ స్టార్ తో డిస్కస్ చేశాడని అంటున్నారు. మరి మళ్లీ సినిమా తీసేదాకా నమ్మకం కుదరదు కాబట్టి పవన్ ఆఖరి సినిమా కొరటాల శివదే అని ఫిక్స్ అవుతున్నారు. మరి ఈ షెడ్యూ లో ఏమన్నా చేంజ్ వస్తుందా అన్నది త్వరలో తెలుస్తుంది.