
మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ధ్రువ సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన అరవింద్ స్వామి అటు మాత్రుకలో కూడా మెప్పించాడు. జయం రవి, అరవింద్ స్వామిల నటనే హైలెట్ గా నిలుస్తూ తని ఒరువన్ అక్కడ సూపర్ హిట్ అయ్యింది.
ఆ క్రేజీ కాంబినేషన్ తో మరో సినిమా వచ్చింది. అదే బోగన్.. హాన్సిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కూడా జయం రవి, అరవింద్ స్వామి కలిసి నటించారు. తని ఒరువన్ హిట్ కాంబినేషన్ కాబట్టి సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశించారు. కాని రీసెంట్ గా రిలీజ్ అయిన బోగన్ తమిళ తంబీలకు రుచించలేదు. తని ఒరువన్ థ్రిల్లర్ కథాంశం కాబట్టి ఆ సినిమాలో వీరి కాంబినేషన్ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అయితే ఆ ఇద్దరిని తెచ్చి ఓ కామెడీ క్రైం స్టోరీగా బోగన్ తెరకెక్కించారు. అంచనాలు తారాస్థాయిలో ఉండటంతో సినిమా ప్రేక్షకులను నిరాశ పరచింది.
తని ఒరువన్ కాంబినేషన్ అని బోగన్ సినిమా మీద తెలుగు దర్శక నిర్మాతలు కూడా కన్నేసి ఉంచారు. ఒకవేళ సినిమా హిట్ అయితే దాన్ని కూడా తెలుగులో రీమేక్ చేసే ఆలోచన చేసేవారేమో కాని టాక్ అంతగా లేకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు.