
మిల్కీ బ్యూటీ తమన్నాను ఓ క్రేజీ ఆఫర్ తనని సంతోషంలో ముంచెత్తేలా చేస్తుంది. తెలుగు తమిళ భాషల్లో దాదాపు స్టార్ హీరొలందరితో కలిసి నటించిన తమన్నా కేవలం విలక్షణ నటుడు విక్రం తో మాత్రం నటించలేదు. విక్రం సినిమాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో తెలిసిందే. తీసే ప్రతి సినిమాలో ఓ కొత్త ప్రయోగం చేస్తూ వస్తున్న విక్రం అంతకంత క్రేజ్ తెచ్చుకున్నాడు.
విజయ్ చందర్ డైరక్షన్ లో విక్రం నటించబోయే సినిమాకు హీరోయిన్ గా తమన్నా ఓకే అయ్యింది. ముందు ఈ సినిమాలో మలయాళ ప్రేమం బ్యూటీ సాయి పల్లవిని అనుకున్నా అమ్మడి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల ఆ ఛాన్స్ మిల్కీ అందుకుంది. తమన్నా కూడా ఎన్నాళ్లనుండో విక్రం తో సినిమా కోసం ఎదురుచూస్తుంది. అందుకే ఈ సినిమా కోసం చాలా ఎక్సయిట్ అవుతుంది. మరి విక్రంతో తమన్నా పెయిర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.