
గబ్బర్ సింగ్ మేనియాతో పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించగా ఆ సినిమా సీక్వల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ వచ్చిన పవర్ స్టార్ సినిమా వల్ల తనకేం పోయిందో తెలియదు కాని డిస్ట్రిబ్యూటర్లు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. అయితే ఆ సినిమా టైంలోనే తను తీస్తున్న తర్వాత సినిమా హక్కులను సర్దార్ నష్టపోయిన వారికే అని నిర్ణయించారు.
డాలి డైరక్షన్ లో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతుండగా సినిమా మీద వస్తున్న బిజినెస్ చూసి నిర్మాత శరద్ పవార్ మాట మార్చాడని తెలుస్తుంది. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు కాకుండా కొత్త వారికి కాటమరాయుడు రైట్స్ ఇస్తారని టాక్. ఈ విషయం మీద సర్దార్ డిస్ట్రిబ్యూటర్స్ చాలా సీరియస్ గా ఉన్నారట. పవన్ కళ్యాణ్ ప్రమేయం మేరకే నిర్మాత ఆ నిర్ణయం తీసుకున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. పవన్ కూడా నిర్మాత నిణయానికి మద్ధతు పలికితే నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. మరి సర్దార్ హామీలకు చెల్లుబాటు ఉంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.