వాట్ ఏ రూమర్.. కాటమరాయుడులో మహేష్..!

ఇండస్ట్రీలో రూమర్స్ కు కొదవేలేదు.. కొన్ని క్రేజీ రూమర్స్ అయితే మరికొన్ని అనవసర గాసిప్స్ అవుతుంటాయి. అలాంటిదే ఇప్పుడు ఫిల్మ్ నగర్ హాట్ న్యూస్ గా మారింది. ఇంతకీ అదేంటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నాడట. ఏంటి ఇది నిజంగా జరిగేదేనా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. పవన్, మహేష్ ల సాన్నిహిత్యం గురించి అందరికి తెలిసిందే. జల్సా టైంలో పవన్ సినిమాకు వాయిస్ ఓవర్ అందించాడు మహేష్.

ఇక ఇద్దరు మధ్య కూడా మంచి రిలేషన్ ఉన్నాయని తెలిసిందే. అందుకే కాటమరాయుడులో పవన్ తో మహేష్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. డాలి డైరక్షన్ లో శరద్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మార్చ్ 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమా వస్తేనే కాని మహేష్ ఉన్నాడా లేడా అన్నది తెలుస్తుంది. ఒకవేళ అది నిజమైతే కనుక పవర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నట్టే.