బిజినెస్ ఓకే.. నాగ్ కొట్టేస్తాడా..!

కింగ్ నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ సినిమా ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ కు రెడీ అవుతుంది. మనం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాల హిట్లతో మంచి ఫాంలో ఉన్న నాగార్జున ఇప్పుడు భక్తి రస చిత్రమైనా కూడా నమో వెంకటేశాయ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతున్నాడు. ఈ సినిమాను ఓవరాల్ గా 35 కోట్ల బిజినెస్ జరిగిందట.

అన్నమయ్య, శ్రీరామదాసు కొత్త అటెంప్ట్ అని ఆడియెన్స్ ఆదరించారు మరి నమో వెంకటేశాయ ఏ రేంజ్లో ఆడుతుందో.. ట్రైలర్ చూస్తుంటే అన్నమయ్యని మళ్లీ చూసిన ఫీలింగ్ అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. అది కాక సినిమా వస్తుంది అన్ సీజన్ లో.. అది చాలదు అన్నట్టు పోటీగా సింగం 3 కూడా ఓ రోజు ముందు రిలీజ్ అవుతుంది. మరి ఈ టైంలో నాగార్జున కొట్టేస్తాడా లేదా అన్నది చూడాలి.   

ఈ సినిమా తర్వాత నాగార్జున చందు మొండేటి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. పవర్ ఫుల్ పోలీస్ కథతో వస్తున్న ఈ సినిమా నాగ్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేయడం ఖాయమని తెలుస్తుంది. కొద్దికాలంగా మాస్ ప్రేక్షకులకు దూరమవుతున్న నాగార్జునను మళ్లీ ఫ్యాన్స్ థ్రిల్ చేసేలా రాబోయే సినిమా ఉండబోతుందట.