
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం యువత ఈ హీరోయిన్ నామమే జపిస్తుంది. ప్రేమంతో మలయాళ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ అక్కడ హిట్ కొట్టడమే కాదు అదే సినిమా తెలుగులో రీమేక్ చేయగా అమ్మడినే తీసుకున్నారు. అంతకుముందే తెలుగులో అఆతో హిట్ అందుకున్న ఈ అమ్మడు ఇదే క్రేజ్ తో డబుల్ హ్యాట్రిక్ అందుకుంది. అయితే అది కేవలం తెలుగు భాషలోనే కాదులేండి. మొదటి సినిమా మలయాళ ప్రేమం తో పాటుగా అఆ, తెలుగు ప్రేమం, ఆ తర్వాత కోలీవుడ్ లో ధనుష్ సరసన కొడి ఇలా చేసిన సినిమాలన్ని సూపర్ హిట్ అందుకుంది అనుపమ.
ఇక రీసెంట్ గా సంక్రాంతికి తెలుగులో వచ్చిన శతమానం భవతి కూడా అనుపమకు మంచి హిట్ ఇచ్చింది. అంతేకాదు ఆ సినిమా రిలీజ్ అయిన వారానికి మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన జామాంట్ సువిశేషంగల్ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించి హిట్ అందుకుంది. సో ఈ లెక్క చూస్తే అమ్మడు వరుసగా నటించిన ఆరు సినిమాలు అవి చిన్న రోల్స్ అయినా సరే అన్ని కలిపి డబుల్ హ్యాట్రిక్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో అనుపమ క్రేజ్ మాములుగా లేదు. మొన్నీమధ్యే ఓ స్టార్ హీరో సినిమా అవకాశం మిస్ చేసుకున్న అనుపమ మరో పెద్ద హీరో సినిమాకు ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది.