
మెగాస్టార్ నటించిన ఖైది నంబర్ 150లోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే.. ఆ పాటలో చెర్రి కూడా ఓ 30 సెకన్స్ ఇలా వచ్చి అలా వెళ్తాడు. మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కలయికలో వచ్చిన ఈ సాంగ్ కోసం మెగా అభిమానులు మళ్లీ మళ్లీ సినిమా చూసేస్తున్నారు. అయితే ఈ పాట క్రేజ్ ఇక్కడ కాదు బాలీవుడ్ హీరోలకు కూడా పాకింది. రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ బడా బిజినెస్ మ్యాన్ ఇంట్లో పెళ్లికి గెస్ట్ గా బాలీవుడ్ క్రేజీ హీరో రణవీర్ సింగ్ అటెండ్ అయ్యారట.
బాలీవుడ్ హీరో వస్తే ఆ ఈవెంట్ ఎంత హుశారుగా ఉంటుందో చెప్పొచ్చు. అలానే అక్కడ సంగీత్ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ కు రణవీర్ కూడా స్టెప్పులేశాడట. ఈ వేడుకలో సౌత్ హీరోయిన్స్ కూడా పాల్గొన్నారట వారు కూడా డ్యాన్స్ వేశారని తెలుస్తుంది. కాని ఈ విషయం మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. మొత్తానికి బాలీవుడ్ క్రేజీ హీరోకి చేత కూడా మెగాస్టార్ పాట స్టెప్పులేయించిందని ఖుషీగా ఫీల్ అవుతున్నారు మెగా అభిమానులు.